| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దేశవ్యాప్తంగా బౌద్ధుల శాంతియుతంగా హక్కుల సాధనకై శాంతియుత ఉద్యమం

దేశవ్యాప్తంగా బౌద్ధుల శాంతియుతంగా హక్కుల సాధనకై శాంతియుత  ఉద్యమం

బౌద్ధ ధర్మ రక్షణకై ప్రతి ఒక్క బుద్ధిస్టులు ముందుకు రావాలి

జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శాంతియుత ధర్నా

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రపంచానికి బుద్ధుడు జ్ఞానోదయం పొందిన పవిత్ర ధర్మభూమి. కానీ అదే భూమిలో బౌద్ధులు పరాయివారిలా ఉండాల్సి వస్తోందని ఇది సనాతన ధర్మానికి, భారత రాజ్యాంగానికి, బౌద్ధ ధమ్మానికి పూర్తి విరుద్ధమని అన్నారు. బోధ్ గయాలో బుద్ధుని జ్ఞానోదయ స్థలమైన మహాబోధి మహావిహార్‌ను పూర్తిగా బౌద్ధుల నియంత్రణలోకి తీసుకురావాలనే లక్ష్యంతో, దేశవ్యాప్తంగా బౌద్ధులు ఒక గొప్ప చారిత్రాత్మక ఉద్యమం చేస్తున్నామన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా, పూజ్య భిక్షు భంతే బుద్ధగోష్ ఆధ్వర్యంలో, 2025 జూలై 21వ తేదీ నుంచి 10 రోజుల శ్రామణేర్ శిబిరం శాంతియుత ధర్నా ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. వీటి ఆక్ట్ 1949 అనేది బీహార్ ప్రభుత్వం రూపొందించిన చట్టమని, ఈ చట్టం ప్రకారం, మహాబోధి మందిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ట్రస్టు బోర్డులో బౌద్ధులు మెజారిటీలో ఉండకూడదు అన్న నిబంధన ఉందనీ, దీంతో, ప్రపంచ బౌద్ధ సంస్కృతి కేంద్రమైన ఈ స్థలంపై బౌద్ధులకు పూర్తి హక్కు ఉండకపోవడం వల్ల, ఇది ఒక విధమైన ధార్మిక అన్యాయంగా నిలుస్తోందన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బుద్ధుడు సమానత్వాన్ని బోధించాడు. కానీ బోధ్ గయాలో బౌద్ధులే అన్యాయంగా అణచివేయబడ్డారన్నారు.

వేలాది సంవత్సరాల నుంచి బౌద్ధ ధర్మానికి జీవం లాంటి స్థలాన్ని, బౌద్ధులు నడిపించలేకపోవడం, ఒక జాతిగా మన హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం ఎంతో బాధాకరమైన విషయం అన్నారు. బాధాకరమని అన్నారు. వీరు చేస్తున్న శాంతియుత ధర్నా కార్యక్రమానికి తెలంగాణ శంకర్ దీక్షలో పాల్గొని వారికి మద్దతు పలికారు.


ఈ కార్యక్రమంలో ది బుద్ధిష్ట్  సొసైటీ ఆఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కంబ్లె దేవిదాస్ ప్రధాన కార్యదర్శి దయానంద సోలంకి కోశాధికారి సంజయ్ గంగానే ఉపాధ్యక్షులు వాగ్మా రే అంతేశ్వర్,అశోక్ భగ్యవాన్. గౌతమ్ కంబ్లె తో పాటు బౌద్ధ మతస్తుల పెద్దలు పాల్గొన్నారు.

Previous "మద్యపానం మానసిక సమస్యలను సృష్టిస్తుంది" : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
Next వర్షాకాలం సీజన్లో ప్రజలు ఏక్కడైనా ఇబ్బందులు పడితే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమస్యను తెలపండి : జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
ADVERTISEMENT