| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బిఆర్ఎస్ కార్యకర్తకు అండగా ఎంపీ వద్దిరాజు

బిఆర్ఎస్ కార్యకర్తకు అండగా ఎంపీ వద్దిరాజు

నిమ్స్ లో చెంగలి నరసింహారావును పరామర్శించిన ఎంపీ

వద్దిరాజు చొరవతో ఆపరేషన్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త, దళిత నాయకుడు చెంగలి నరసింహారావు గత కొంతకాలంగా మెదడులో కణితి తో బాధపడుచు ఉండడంతో. ఈ విషయమై నర్సింహారావు కుటుంబ సభ్యులు, స్థానిక బి ఆర్ఎస్ నాయకులు బి ఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ ,రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లగా. ఆయన తక్షణమే స్పందించి నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తో మాట్లాడి తక్షణ వైద్యం అందించాల్సిందిగా కోరారు. ఆయన సూచన వెంటనే మేరకు ఆపరేషన్ నిర్వహించి కనితిని తొలగించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న నరసింహారావును సోమవారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. వెంట ఉన్న నరసింహారావు సతీమణి నాగమణి, కుమార్తె నాగ శైలు లను ధైర్యంగా ఉండాలని బోధిస్తున్న వారిని ఓదార్చారు. మెరుగైన వైద్యం  అందించి త్వరగా కోలుకునేలా చూడాలని డాక్టర్లకు సూచించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా అయ్యేంతవరకు అవసరమైన సహకారం అందిస్తానని రవిచంద్ర తెలిపారు. ఆయన వెంట సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఉస రఘు, ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దిండిగల రాజేందర్, వైరా నియోజకవర్గ బి ఆర్ఎస్ నాయకులు లాకావతు గిరిబాబు, సీనియర్ జర్నలిస్ట్ బాపట్ల మురళి ఉన్నారు.

Previous మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు
Next ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు
ADVERTISEMENT