| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పేకాటఆడుతున్న వ్యక్తులను అరెస్టు చేసిన ఇల్లెందు సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ

పేకాటఆడుతున్న వ్యక్తులను అరెస్టు చేసిన ఇల్లెందు సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని కట్టుగూడెం పాత పెంకు ఫ్యాక్టరీలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు చేసి పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పేకాట ఆడుతున్న విషయం తెలుసుకొని దాడి చేయగా ఎనిమిది మందిని  అరెస్ట్ చేశామని ఒకరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. పేకాట స్థావరం పై దాడిలో రూ.46 వేలు నగదు, 8 సెల్ ఫోన్లు, ఒక కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 9 మంది పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సందర్భంగా సీఐ బత్తుల సత్యనారాయణ అన్నారు. ఈ దాడిలో ఇల్లెందు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Previous మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్: సీఎం రేవంత్ రెడ్డి
Next మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు
ADVERTISEMENT