| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహా నగరంలో మహిళలకు రక్షణ ఏది?

మహా నగరంలో మహిళలకు రక్షణ ఏది?

డైలీ భారత్, హైదరాబాద్:షీ టీం నిఘా పటిష్ట  భద్రత వ్యవస్థలో ఉన్న మహిళలకు రక్షణ ఏది? ఇప్పుడు హైదరాబాదు నగరం మహిళల రక్షణ విషయంలో భద్రత వ్యవస్థ ఏం చేస్తున్నట్లు.. కామాంధు లు, పోకిరీల ఆగడాలు మితి మీరిపోతున్నాయి. కఠిన చట్టాలు అమలవు తున్నప్పటికీ మహిళలు, యువతులపై లైంగిక వేధిం పులకు పాల్పడుతూనే ఉన్నారు. 

ఈ క్రమంలో హైదరాబాద్‌ మధురానగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దారుణం వెలుగు చూసింది. బరితెగించిన కామాంధులు భర్త కళ్లెదుటే భార్యను వేధించారు. అసభ్యకర మాటలతో రెచ్చిపోయారు. నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో ఆకతా  యిలు బెదిరింపులకు పాల్పడ్డారు.

భర్త, మరిది, ఆడపడుచు తో కలిసి బేగంపేటలోని ఓ పబ్‌కెళ్లి ఇంటికి రాత్రి11: 30కి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎస్ ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద భర్తపై ముగ్గురు యువకు లు దాడి చేశారు. వివాహి తను వెంబడించారు. 

వారి నుంచి తప్పించుకుని డయల్‌ 100కి ఫోన్‌ చేశారు బాధితులు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు ముగ్గురు ఆకతాయి లను అరెస్టు చేశారు. 

పంజాగుట్టకు చెందిన డి.సంపత్ (28), సందీప్ (28), కూకట్ పల్లికి చెందిన ఉమేష్ (28)లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Previous ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
Next డ్వాక్రా సంఘాల కోసం ప్రత్యేక యాప్- అక్రమాలకు ప్రభుత్వం చెక్
ADVERTISEMENT