డైలీ భారత్, కారేపల్లి: సింగరేణి మండల కేంద్రంలో మజీద్ పక్కన షాదిఖాన భవనం గత వైరా ఎమ్మెల్యేగా ఉన్న బానోత్ మదన్ లాల్ బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో 2018లో 35 లక్షల వ్యయంతో నిర్మించగా ఇప్పటివరకు నిరుపయోగంగా మిగిలి ఉంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే షాదికాన ఉపయోగపడేలాగున ఉన్న భవనాన్ని వాడుక లోకి తేవాలని గతంలో కూడా చాలాసార్లు అధికారులకి విజ్ఞాపనలు చేసిన పట్టించుకోలేదని భవనం చుట్టూను పిచ్చి చెట్లతో అపరిశుభ్రతగా ఉందని జిల్లా మైనార్టీ నాయకులు, కారేపల్లి గ్రామపంచాయతీ మాజీ వార్డు సభ్యులు ఎస్కే గౌసుద్దీన్ అధికారులను కోరారు. షాది ఖానా భవనాన్ని వాడుకలోకి తెస్తే ఇఫ్తార్ విందుకు, పెళ్లిళ్లకు ఫంక్షన్స్ కు ఉపయోగపడుతుందని వారు అన్నారు.
News
నిరుపయోగంగా షాదిఖానా.. పట్టించుకోని అధికారులు