తెలంగాణ స్టేట్ కరాటే చాంపియన్ - 2025 రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో కాంస్య పతకం ను గెలుపొందిన మహర్షి విద్యాలయ సి.బి. యస్.ఇ. హైస్కూల్ విద్యార్ధి భూక్య భరత్ నాయక్
డైలీ భారత్, మహబూబాబాద్: తేది. 09.03.2025, న హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డు అసోసియేషన్ ఆధ్వర్యంలో* పదవ తెలంగాణ స్టేట్ కరాటే చాంపియన్ షిప్ -2025 రాష్ట్ర స్థాయి పోటీలను హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో నిన్న ఘనంగా నిర్వహించింది
ఈ యొక్క పోటిలో మహర్షీ విద్యాలయ సి.బి.యస్.ఇ హైస్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్న బాలుతండ, హరిదాస్ తండ గ్రామము, రాజోలు, కురవి మండలానికి చెందిన భూక్య భరత్ నాయక్ కరాటే రాష్ట్ర స్థాయిలో అండర్ ముప్పై ఒకటి కిలోల విభాగంలో తృతీయ స్థానంలో కాంస్య పతకం బ్రంజ్ మెడల్ లో విజయం సాదించారు. అనంతరం తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డు అసోషషన్ మరియు కిఓ వైస్ ప్రెసిడెంట్ B. మహేష్ కుమార్ గౌడ్, స్టేట్ జనరల్ సెక్రటరీ యస్. ఎల్. నరసింహారెడ్డి , స్టేట్ ట్రెజరర్ యం. రామస్వామి ల చేతుల మీదుగా పతకం అందుకొన్నారు
ఈ యొక్క రాష్ట్ర స్థాయి కాంస్య పతకం విజయం సాధించటానికి విశేషంగా కృషి చేసిన మహర్షి విద్యాలయ కరాటే కోచ్ మరియు కరాటే అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా సెక్రటరీ యం.డి .అమీర్ పాషా, మహర్షి విద్యాలయ కరస్పాండెంట్ యం. సుధ అర్జున్ రెడ్డి మరియు స్కూల్ ప్రిన్సిపాల్ కళ్యాణ్ కు వారి యొక్క తల్లిదండ్రులు ప్రముఖ సామాజిక వేత్త, ప్రొఫషనల్ మల్టి పర్పస్ ఇంటర్నేషనల్ సోషల్ వర్కర్, ప్రపంచ శాంతి అవార్డు, మహాత్మ గాంధి జాతీయ శాంతి అవార్డు మరియు మదర్ థెరీసా మెమోరియల్ అవార్డు గ్రహీత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ జాతీయ అవార్డు, జ్వోతిబాపులే నషనల్ ఫెలోషిప్ అవార్డు, లైఫ్ టైమ్ గోల్డెన్ అచీవ్మెంట్ అవార్డు మరియు తెలంగాణ స్టేట్ సేవరత్న అవార్డు ల గ్రహీత భూక్య బాలు నాయక్, స్వర్ణ లత దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
అనంతరం రాష్ట్ర స్థాయిలో పతకం మరియు గతంతో జాతీయ స్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన కరాటే క్రీడాకారుడు భూక్య భరత్ నాయక్ కి స్థానిక మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్, డోర్నకల్ ఏం.ఎల్.ఏ మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రాంచందర్ నాయక్, మహబూబాబాద్ ఏం.ఎల్.ఏ డాక్టర్.భూక్య మురళీ నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జెన్న రెడ్డి భరత్ చందర్ రెడ్డి రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ డా. బెల్లయ్య నాయక్, మహర్షి విద్యాలయ స్కూల్ యాజమాన్యం భూక్య భరత్ నాయక్ కు ప్రత్యేకంగ అభినందించి భవిష్యత్ లో ఇంక మరిన్ని మెడల్స్ సాధించి తల్లిదండ్రులకు , గురువులకు మరియు దేశానికి మంచి పేరు తీసుకు రావాలని మరియు ఉన్నంత శిఖరాలకు అదిరోధించాలని పేర్కొన్నారు