వరంగల్ జిల్లాలో రోడ్డుపై తగలబడుతున్న కారు.. అందులో నోట్ల కట్టలు, అందినకాడికి దోచుకున్న జనం..
డైలీ భారత్, వరంగల్: వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం బోల్లికుంటలోని వాగ్దేవి కళాశాల ముందు ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో పొగలు వస్తుండటంతో అప్రమత్తమైన స్థానికులు మంటలను అర్పివేసి ఇంజిన్‌లో చూడగా కట్టల కొద్దీ డబ్బు కనిపించింది. దీంతో ఎవరికి వారు దొరికినంత సొమ్మును జేబుల్లో పెట్టుకుని పరిగెత్తారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ కారు ఎవరిదో తేల్చే పనిలో పడ్డారు. కారులో దాదాపు రూ.25 లక్షలు వుంటుందని అంచనా..