డైలీ భారత్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి నేడు పదవీవిరమణ పొందిన పోలీస్ అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్ మంగళవారం ఘనంగా సత్కరించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు ఎస్.ఐలు ఉమాకాంత్, ఐలయ్య, ఏ.ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్, పద్మారావు కానిస్టేబుల్ లను పోలీస్ కమిషనర్ పూలమాలలతో ఘనంగా సత్కరించడంతో పాటు, వారికి జ్ఞాపికలను అందజేసారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని, ప్రస్తుతం పదవీవిరమణ చేస్తున్న పోలీస్ అధికారులు వారి పదవీ సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడంతో పాటు, కొన్ని సమయాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి వీరు రేపటి తరం పోలీసులకు స్పూర్తిదాయకంగా నిలుస్తారని పదవీవిరమణ చేసిన పోలీసు అధికారులు తమ ఆరోగ్యం కోసం నిరంతరం యోగ లేదా వ్యాయామాన్ని కొనసాగించడంతో పాటు, వారి కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించాలని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
ఈ కార్యక్రమములో అదనపు డిసిపిలు రవి, సురేష్‌కుమార్, ఏసిపి అనంతయ్య ఆర్.ఐలు సతీష్, స్పర్జన్‌రాజ్, శ్రీనివాస్, శ్రీధర్ ఆర్.ఎస్.ఐ శ్రవణ్ తో పాటు పదవీవిరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రులు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.