డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గ్రామల ప్రజలకు నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవాలి పోలీస్ శాఖ నిబంధనలను అతిక్రమించరాదు
నూతన సంవత్సర వేడుకల్లో టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
డీజే లు నిషేధం,నిబంధనలు విరుద్ధంగా వినియోగిస్తే సీజ్ చేసి,కేసులు నమోదు చేస్తాం.
మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం. వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది ప్రభుత్వ,ప్రవేట్ ఆస్తులపై,రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టినా, అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.మద్యం దుకాణాల్లో మైనర్లకు మద్యం అమ్మకూడదు.బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి వల్ల ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే వారి సంరక్షకుల పైన కేసులు నమోదు చేస్తాం. పై అంక్షలను ఎవరైన అతిక్రమించినా, ఉల్లంఘించినట్లుగా దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయి. ఈ వేడుకలను ప్రజలు,యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది
అదేవిధంగా కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ, మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు