డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో గల స్టార్ కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చి రాకేష్ అనే కానిస్టేబుల్ శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడు సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. కర్మన్ ఘాట్ లో నివాసం ఉండే రాకేష్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధ బాధపడుతున్నట్లు తెలిసింది.ఈక్రమంలో ఇవాళ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
నిన్న రాత్రి మొయినాబాద్ లోని బంధువుల ఇంటికి వచ్చిన రాకేష్ అందరితో కలిసి ఉన్నాడు. ఇవాళ తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...