| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉన్నవాడికే దోచిపెట్టే విధంగా రైతుబంధు పథకం : కాంగ్రెస్ నాయకుడు తీన్మార్ మల్లన్న

ఉన్నవాడికే దోచిపెట్టే విధంగా రైతుబంధు పథకం : కాంగ్రెస్ నాయకుడు తీన్మార్ మల్లన్న

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగల్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కి మద్దతుగా తీన్మార్ మల్లన్న రోడ్ షోలో పాల్గొన్నాడు. ఈ పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కరెంటు గ్యాస్ బస్చార్జిలతో సహా అన్ని రకాల  ధరలను పెంచి ప్రజలపై భారమేసిందని, ఒక ముఖ్యమంత్రి కొడుకు సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో డబుల్ బెడ్రూంలు అర్హులైన వారందరికీ ఇవ్వలేకపోయారని , కెసిఆర్ సొంత ఊరు అయిన చింతమడకలో ఇంటికి 10 లక్షలు ఇచ్చాడని.. చింతమడకకు ఓ న్యాయం సిరిసిల్లకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. రైతుబంధు రైతు బీమా పథకాలు ఎవరికి ఉపయోగపడలేదని ఇప్పటివరకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 80 వేల మంది రైతులు చనిపోయారని, కల్వకుంట్ల కుటుంబానికి కష్టం వస్తే ఢిల్లీ వరకు వెళ్తారని అదే ఈ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకు కష్టం వస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సిరిసిల్లలో కేటీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వ నియంత పరిపాలనకు ఓటుతో స్వస్తి చెప్పాలని అన్నారు.


Previous ఎన్నికల వేళ ఐదు కోట్ల నగదు పట్టివేత
Next సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బిఎస్ఎఫ్, జిల్లా పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్.
ADVERTISEMENT