ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని అంటున్న గ్రామస్తులు మరియు తుడుం దెబ్బ నాయకులు
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఒక టీచర్ తరచుగా పిల్లలను కొడుతున్నాడని పిల్లల తల్లిదండ్రులు అందరూ కలిసి క్లాస్ రూమ్ లోకి తాళాలు వేసి ఆందోళన చేశారు,గత రెండు రోజుల క్రితం 10వ తరగతి చదువుతున్నా ఒక బాబు ఎదిరాజు రోహిత్ నీ కొట్టగా చెవులో నుంచి రక్తం కారి తీవ్ర ఇబ్బంది పడ్డాడని,వారం రోజుల క్రితం మరో బాబు లంకా దీక్షిత్ నీ కొట్టగా చెంపలు వాసినాయని,గత ఆరు నెలల నుంచి ఈ పాఠశాలలో ఇదే సంఘటనలు జరుగుతున్నాయని,ఎవరైతే పిల్లల పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నరో ఆ టీచర్ ని విధుల నుంచి తొలగించాలని ఆందోళన చేపట్టారు,సంబధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు,తుడుం దెబ్బ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో బండారు సూర్యనారాయణ,తంబళ్ల రవి,కారం వెంకటేష్, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.