అశ్వారావుపేట నియోజిక వర్గం ఏజెన్సీ ప్రాంతం లో ..ఆదివాసీ సంఘాల నాయకులు హెచ్చరిక
డైలీ భారత, అశ్వరావుపేట: అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం కేంద్రం లో ఆదివాసీ సంఘాల నాయకులు అత్యవసర సమావేశం కావడం జరిగింది,ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు బండారు సూర్యనారాయణ మట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసీల అమాయకత్వంను ఆసరాగా చేసుకోని ఆదివాసీ హక్కులను కొందరు వారి స్వర్ధం కోసం కాలరాశే ప్రయత్నం చేస్తున్నారు.....రాజకీయ పార్టీల ముసుగులో కొందరు ఆదివాసీలకు ఉన్నా సర్వహక్కులు హరించెలా వ్యవహారిస్తున్నారు అని, వారు తిరు మార్చుకోవాలనీ హితవు పలికారు,
భారత రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ లో ఏజెన్సీ ప్రాంతంలో సర్వహక్కులు ఆదివాసీలకే చెందుతాయి అని వారు అన్నారు,ఐదవ షెడ్యూల్ ఉన్నా ఏ ప్రాంతంలో అయ్యిన ఆదివాసీలు పర్యటించవచ్చునని ఆదివాసీ హక్కులు భంగం కలిగించేేలా మమ్మలను ధూషించాడం,వక్రీకరించడం చేస్తే గిరిజనేతరులపై Sc,st అట్రాసిటీ కేసులు పెట్టించటానికి వెనుకాడబోము అని,ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడైనా ఆదివాసీ బిడ్డలకు అన్యాయం జరిగితే ఆదివాసీ సంఘాల నాయకులు ఏక తాటి పై వచ్చి తిరుగుబావుట ఏగురవేస్తo అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో ఆదివాసీ నాయుకులు తంబల్ల రవి,సోయం రామ్మూర్తి,వాసం వెంకటేశ్వరరావు,కారం బొజ్జి,వాసం.పోలయ్య,సోయం.ఉమామహేశ్వరావు,కారం నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.