| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

608 మంది నామినేషన్ల ఉపసంహరించుకున్నారు.

608 మంది  నామినేషన్ల ఉపసంహరించుకున్నారు.

డైలీ భారత్:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు మిగిలారు. బుధవారం 608 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 

భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ బరిలో నిలిచిన గజ్వేల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడం గమనార్హం. ఆ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

సీఎం పోటీ చేస్తున్న మరో నియోజకవర్గమైన కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు తుది పోరులో ఉన్నారు.

ఆ తర్వాత ఎల్‌బీ నగర్‌లో అత్యధికంగా 48 మంది, పాలేరులో 37, కోదాడలో 34, నాంపల్లిలో 34, ఖమ్మంలో 32, నల్గొండలో 31, కొత్తగూడెంలో 30 మంది ఎన్నికల బరిలో నిలిచారు.

Previous వేములవాడ పట్టణానికి చెందిన పలువురు బార్ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిక
Next నక్సలైట్ల కలకలం.. రెండు చోట్ల ఐఈడీ పేలుడు..
ADVERTISEMENT