| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏడో తరగతి బాలికపై యువకుడి లైంగికదాడి

ఏడో తరగతి బాలికపై యువకుడి లైంగికదాడి

డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఏడో తరగతి బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కొమురవెల్లి మండలం గురువన్నపేటలో చోటుచేసుకుంది. ఈవిషయాన్ని కుటుంబ సభ్యులకు బాలిక తెలిపింది. దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిందితుడి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యవకుడు, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు కోపంతో నిందితుని ఇంటిని పెట్రోల్ పోసి తగలపెట్టారు. అంతేకాకుండా అక్కడే వున్న కారు, జేసీబీని ధ్వంసం చేశారు. గ్రామస్తుల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన కారులు చెదరగొట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పరారీలో వున్న యుకువడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడితో ముందే పరిచయం వుందా? బాలికను ట్రాప్ చేసి ఆమెపై లైంగిక దాడి చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. యువకుడితో పాటు కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉండటంతో పోలీసులకు ఈ ఘటన సవాల్ గా మారింది.

Previous డా.గడల.శ్రీనివాసరావుకి శుభాకాంక్షలు తెలిపిన డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్ కో ఆర్డినేటర్
Next నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
ADVERTISEMENT