డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా:సిరిసిల్ల టౌన్: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత హి సేవలో భాగంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో (మాస్ క్లీనింగ్) శ్రమదానం కార్యక్రమం సిరిసిల్ల తంగలపల్లి బ్రిడ్జి వద్ద ఇటీవల నిమర్జనం నిర్వహించిన ప్రాంతంలో చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని సిరిసిల్ల పురపాలక సంఘం ద్వారా వీటిలో పొందుపరిచిన అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని దాంట్లో భాగంగా నే నిమర్జనం పూర్తి అయిన ప్రాంతం లో పూర్తి స్థాయిలో క్లీనింగ్ చేయుటకు ఈ ప్రాంతంలో శ్రమదానం కార్యక్రమం చేపట్టడం తో పాటు మా సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది అని ఇంతటితో కాకుండా అక్టోబర్ 2వరకు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని పట్టణ ప్రజలు కూడా మాకు సహకారం అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కమిషనర్ తో, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అంజగౌడ్ మున్సిపల్ సిబ్బంది,మెప్నా రిసోర్స్ పర్సన్స్ ,మెప్మా సిబ్బంది మరియు వార్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.