డైలీ భారత్, సిరోహి జిల్లా: ఆలయానికి వెళ్లి వస్తున్న క్రమంలో తుఫాన్ వాహనం ఆకస్మాత్తుగా వెళ్లి ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషాధ ఘటన రాజస్థాన్(Rajasthan)లోని సిరోహి జిల్లా(sirohi) పిండ్వారా ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే తుఫాన్ రాంగ్ డైరెక్షన్‌లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో జీప్ పూర్తిగా ప్రయాణికులతో లోడ్ అయి ఉంది.
News