డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ భవన్ నుంచి పోరుయాత్రకు కేసీఆర్ బుధవారం శ్రీకారం చుట్టారు.
భవన్‌కు చేరుకున్న కేసీ ఆర్‌కు మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. మొదట భవన్ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు
కేసీఆర్. అనంతరం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైం ది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేశారు. బాణాసంచా కాల్చి బీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
నేటి నుంచి 17 రోజుల పాటు సాగే ఈ యాత్ర కొనసాగనుంది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాల గూడలో ప్రారంభమై సిద్దిపే టలో జరిగే బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది.