డైలీ భారత్ మెదక్ : హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ హనుమాన్ పుణ్య క్షేత్రం కొండగట్టుకు ఈరోజు భక్తులు పోటెత్తారు.
శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజ నేయం.. శ్రీరామ జయరామ నామ స్మరణతో కొండగట్టు క్షేత్రం మార్మోగింది. మంగళ వారం హనుమాన్ జయంతి సందర్భంగా కొండంతా కిక్కిరిసిపోయింది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల తో కాషాయవర్ణ శోభితమైం ది. జయంతి సందర్భంగా ఉదయం నుంచే స్వామివా రికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు...