స్టేషన్ మాసాయిపేట ఎంపిటిసి రంజాన్ శుభాకాంక్షలు మైనార్టీ సోదరులకు తెలిపారు
డైలీ భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండలం పరిధిలోని స్టేషన్ మాసాయిపేట గ్రామంలో కొప్పులపల్లి ఎంపిటిసి నవనీత స్టేషన్ శ్రీను మైనార్టీ సోదరులతో రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మీయ సమ్మేళనం వారితో జరుపుకున్నట్లు కొప్పులపల్లి ఎంపిటిసి స్టేషన్ శ్రీను తెలిపారు అదేవిధంగా గురువారం నాడు రంజాన్ పండగ ఉండడం బట్టి బల్బులు వెలగడం లేదని తెలపడంతో స్పందించి వెంటనే స్టేషన్ మాసాయిపేట ఎంపిటిసి స్టేషన్ శ్రీను స్పందించి వెంటనే మరమ్మతులు తన సొంతంగా చేసి మైనార్టీ సోదరులకు వెలుగులు వికసించేలా మరమ్మతులు చేపట్టారు కలిసి ఉంటే సుఖం అని ముస్లిం సహోదరులతో ఐక్యంతో ఉండి మా గ్రామంలో అందరం కలిసి ఉంటామని ఆదర్శంగా ఇతర గ్రామాలు తీసుకోవాలని అన్నారు స్టేషన్ మాసాయిపేట గ్రామంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగినట్లు ఒకరికొకరం ఆనందంతో ప్రతిరోజు కులంబేదం లేకుండా మైనార్టీ సహోదరులతో కలిసిమెలిసి ఉండి ప్రతిరోజు దినం వెళ్లిపోతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా అల్లా మా గ్రామస్తుల వెంబడి ఉండి మా ప్రార్థనలు అల్లా దేవుడు విని మైనార్టీ సహోదరులను మమ్మల్ని చల్లగా చూస్తాడని ఎంపిటిసి స్టేషన్ శ్రీను తెలిపారు.