ఆకస్మిక రైడ్ లు నిర్వహిస్తున్నాం.
ఇప్పటివరకు మొత్తం 4.55 కోట్ల విలువ సీజ్ చేశాం.
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో తనిఖీలు.
రాహుల్ హెగ్డే ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట
డైలీ భారత్, సూర్యాపేట: పార్లమెంట్ ఎన్నికలు నిర్వహణలో బాగంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ఠమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే IPS ఒక ప్రకటనలో తెలిపినారు. అంతరాష్ట్ర సరిహద్దు వెంట నిఘా ఉంచాం, సరిహద్దు వెంట, రామాపురం x రోడ్డు వద్ద, మట్టపల్లి బ్రిజ్జి వద్ద, దొండపాడు వద్ద, పులిచింతల ప్రాజెక్ట్ వద్ద, చింత్రియాల వద్ద, బగ్గమాదారం వద్ద అంతరాష్ట్ర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి అక్రమ రవాణా అడ్డుకుంటున్నం అన్నారు. ఆంధ్రా రాష్ట్ర అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నాం అన్నారు. అలాగే అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లకు అనుబంధంగా అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లు NH 65 పై టేకుమట్ల వద్ద, బీమారం వద్ద. పాతతిరుమలగిరి వద్ద, వెలిషాల వద్ద, మామిల్లగుడెం వద్ద, శాంతినగర్ వద్ద చిల్లేపల్లి వద్ద, కుంటపల్లి వద్ద ఏర్పాటు చేశాం అన్నారు. పారామిలిటరీ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన స్థాయికి అధికారుల సహాయంతో జిల్లా అంతటా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తన్నాము అన్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి ఈరోజు వరకు జిల్లా వ్యాప్తంగా 1 కోటి 71 లక్ష నగదు, 7 లక్షల 75 వేల విలువ గల మద్యం, 20 వెల విలువగల గంజాయి, 1 కోటి 14 లక్షల విలువగల ఆభరణాలు, 86 లక్షల విలువగల ఇతర విలువైన ఎలక్ట్రానిక్, డస్తువులు, ఇతర వస్తువులు సీజ్ చేశాం అన్నారు. అలాగే ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో 75 లక్షల విలువగల మద్యం సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 4 కోట్ల 55 లక్షల వివవ సీజ్ చేయడం జరిగినది అని ఎస్పి తెలిపినారు.