| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు జారీ

కాంగ్రెస్ పార్టీకి ఐటీ  నోటీసులు జారీ

డైలీ భారత్, న్యూ ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపి స్తున్న వేళ ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ పార్టీకి ఐటీ విభాగం మరో సారి నోటీసులు జారీ చేసింది.

ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత వివేక్‌ తంఖా ఈరోజు వెల్లడించారు. 2017-18, 2020-21 మదింపు సంవ త్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.

తమపై ఐటీ విభాగం ప్రక్రి యను నిలిపివేయా లంటూ పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ పరిణామాలు చోటుచేసు కోవడం గమనార్హం. ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే గురువారం తాజా నోటీసులిచ్చారని వివేక్‌ తంఖా ఆరోపించారు.

ఇది అహేతుక, అప్రజాస్వా మిక చర్య అని ఆయన మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేం దుకు కేంద్రం ప్రయత్నిస్తోం దని దుయ్యబట్టారు.దీన్ని తాము చట్టపరంగా ఎదు ర్కొంటామని అన్నారు.

Previous షాద్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా రాజశేఖర్ రాజు
Next జగిత్యాల జిల్లాలో నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య
ADVERTISEMENT