ఉత్కంఠగా 2024-25 ఎన్నికలు
ఉపాధ్యక్షులుగా టి శ్రీనివాస్, విజయభాస్కర్ గౌడ్
లైబ్రరీ సెక్రటరీగా లక్ష్మయ్య
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది బి. రాజశేఖర్ రాజు గెలుపొందారు. గురువారం షాద్ నగర్ కోర్టు ఆవరణలో జరిగిన బార్ అసోసియేషన్ 2024- 25 సంవత్సరం ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారిగా న్యాయవాది మర్రి శంకరయ్య వ్యవహరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి బి. రాజశేఖర్ తో పాటు ఎన్. వేణుగోపాల్ పోటీపడ్డారు. మొత్తం 141 ఓట్లు ఉండగా ఇందులో 137 ఓట్లు పోల్ అయ్యాయి. అదేవిధంగా రాజశేఖర్ రాజుకు 86 ఓట్లు రాగా, ఎంఏ రజాక్ హుస్సేన్ కు మూడు ఓట్లు వచ్చాయి. అదేవిధంగా ఎన్.వేణుగోపాల్ కు 48 ఓట్లు వచ్చాయి. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవికి టి. శ్రీనివాసులు 92 ఓట్లు, విజయభాస్కర్ గౌడ్ కు 91ఓట్లతో ఇద్దరు ఎంపికయ్యారు. న్యాయవాది చంద్రశేఖర్ కు 52 ఓట్లు, మదన్మోహన్ కు 25 ఓట్లు వచ్చాయి. లైబ్రరీ సెక్రటరీగా లక్ష్మయ్యకు 92 ఓట్లు రాగా రమేష్ కు 62 ఓట్లు పోలయ్యాయి. ఇందులో లక్ష్మయ్య గెలుపొందారు. ఒక సంవత్సరం పదవీకాలం ఉంటుందని ఎన్నికల అధికారి శంకరయ్య తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపించిన సహచర న్యాయవాదులకు అధ్యక్షులు బి. రాజశేఖర్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి..