డైలీ భారత్, విజయవాడ: విజయవాడ నగర శివారు కానూరులో ఈరోజు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. న్యూ ఆటోనగర్‌లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు చెలరే గాయి.
దీంతో ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలముకుంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక శకటాలతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనుమ తులు లేకుండా ఈ కర్మాగా రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం.
మంగళవారం ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమ యంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపా యం తప్పింది. ఆస్తినష్టం భారీగా జరిగినట్లు అధికా రులు అంచనా వేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అను మానిస్తున్నారు..