డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలోఈరోజు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి మొదటి అంతస్తు ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆస్పత్రి పరిసరాలు పొగతో నిండిపోయాయి.
ఒక్కసారిగా చెలరేగిన మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటా హుటిన ఆస్పత్రికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తు న్నారు.
అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఆస్పత్రిలోని పిల్లలు, పెద్దలు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు..
#fire accident #Hyderabad #niloufer hospital