| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీజేపీ పార్టీ కీ బాబూమోహన్ గుడ్ బై

బీజేపీ పార్టీ కీ బాబూమోహన్ గుడ్ బై

డైలీ భారత్, హైదరాబాద్:సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు.

పార్టీలోని తాజా పరిస్థితు లతో అసంతృప్తికి గురైన ఆయన పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు వెల్లడించారు.

బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌ రెడ్డిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.గత కొంతకాలంగా పార్టీలో ఇమడలేకపోయిన పరిస్థితుల్లో పూర్తిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే నిర్ణయాన్ని తీసుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగానే తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఆ తర్వాత టికెట్ రావడంతో చల్లబడ్డా రు. తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన పార్టీ నుంచి పూర్తిగా తప్పు కోడానికి నిర్ణయం తీసు కోవడం గమనార్హం..

Previous చెరువులో శవమై తేలిన చిన్నారి
Next తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
ADVERTISEMENT