డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఈనెల 8.9.10 తేదీల్లో యాదగిరిగుట్టలో జరిగిన AIYF మూడవ తెలంగాణ రాష్ట్ర మహాసభలో జూలూరుపాడు మండలం వెంగనపాలెం గ్రామానికి చెందిన ఎస్కే చాంద్ పాషా ను రాష్ట్ర సమితి సభ్యుడుగా ఎన్నుకున్నాడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి యువతకు ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్నారని ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్నారని . రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోవాలని, రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఎంతో నమ్మకంతో రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎన్నుకున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు సీపీఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా కు ధన్యవాదాలు తెలియజేశారు
News
AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక