| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

డైలీ భారత్, జూలూరుపాడు:గణేష్ నవరాత్రి ఉత్సవాలకు తప్పనిసరిగా ఆన్‌లైన్ అనుమతి తీసుకోవాలి

జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే ప్రతి గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా తెలంగాణ పోలీస్ శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకుని అనుమతి తీసుకోవాలని జూలూరుపాడు మండల ఎస్సై జీనత్ కుమార్ తెలిపారు.

మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, మండప నిర్వాహకుల పూర్తి వివరాలు, ఫోన్ నంబర్, ఊరేగింపు మరియు నిమజ్జన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.

ఈ నమోదు ద్వారా ఉత్సవాలు, నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతా ఏర్పాట్లు చేపట్టడానికి వీలవుతుందన్నారు.

కావున జూలూరుపాడు మండల పరిధిలోని గణేష్ మండప నిర్వాహకులు అందరూ సహకరించి తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలని కోరారు.

Previous AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక
Next సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
ADVERTISEMENT