| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం  స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

TUCI జిల్లా ఉపాధ్యక్షులు ఎదులాపురం గోపాలరావు

స్కావెంజర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నిమ్మటూరి లక్ష్మయ్య లు డిమాండ్

సమస్యల పరిష్కారం కోసం meo కార్యాలయం ముందు ధర్నా

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ కం స్కావెంజర్లుగా పనిచేస్తున్న కార్మికులకు జీతాలను పాఠశాల కమిటీ చైర్మన్ లు ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండానేరుగా కార్మికుల బ్యాంక్ అకౌంట్లో   జమ చేయాలని TUCI జిల్లా ఉపాధ్యక్షులు ఎదులాపురం గోపాలరావు,

స్కావెంజర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నిమ్మటూరి లక్ష్మయ్య లు డిమాండ్ చేసారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం meo కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించి, కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 

కార్మికులకు అతి తక్కువ వేతనం చెల్లించడం మూలంగా వారి కుటుంబాలు అర్ధాకలి తో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విధంగా స్వీపర్ కం స్కావెంజర్లను అనుస్కిల్డ్ కార్మికులుగా గుర్తించి 12,000 వేతనం అందించాలని వారు కోరారు.

భద్రతలేని జీవితాలు గడుపుతున్న  కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ,వారిని పూర్తి కాలం కార్మికులుగా గుర్తించి చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని వారు కోరారు. పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలను త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా meo జుంకిలాల్ ఫోన్ లో కార్మికుల కు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నూనావత్ లక్ష్మణ్, జమలయ్య, మేరీ, రాజమణి, సౌజన్య, శేషమ్మ, రాధిక, కౌసల్య, సత్యవతి, లక్మీ , ఉమారాణి, రాములమ్మ, శాంతి , సోనీ, తదితరులు పాల్గొన్నారు.

Previous అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Next AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక
ADVERTISEMENT