డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎన్సీపీ పార్టీ ఎన్వైసీ నాయకులు మద్దిశెట్టి సామెల్ గత కొంతకాలంగా అధిక జ్వరం మరియు టాన్సిల్స్ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో వైద్యులను సంప్రదించి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, ప్రస్తుతం ఇన్‌డోర్‌లో విశ్రాంతి తీసుకోవాలని, శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. అలాగే చల్లటి పదార్థాలు, చల్లటి పానీయాలు తీసుకోవద్దని ప్రత్యేకంగా సూచించారు.వైద్యుల సూచనల మేరకు అవసరమైన మందులు తీసుకుంటూ, కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.మద్దిశెట్టి సామెల్ త్వరగా కోలుకొని తిరిగి ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
News
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్