| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

డైలీ భారత్, హైదరాబాద్: శంషాబాద్ శివార్లలోని తుక్కుగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న యువ నర్సును గొంతు నులిమి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హత్య అనంతరం మృతదేహంపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన యువతి ఈ ఏడాది జనవరిలోనే తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రి యాజమాన్యం నర్సుల కోసం ఆస్పత్రికి దూరంగా మెకానిక్ షెడ్ల వెనుక విశ్రాంతి గదులు ఏర్పాటు చేసింది.

శుక్రవారం రాత్రి బాధితురాలు ఒంటరిగా గదిలో ఉండగా, సమీప మెకానిక్ షాపులో పనిచేసే బీహార్ కు చెందిన సైనా ఉల్లా (35) కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

శనివారం ఉదయం తోటి నర్సు తలుపు తట్టినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా యువతి విగతజీవిగా పడి ఉంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

నిందితుడు సైనా ఉల్లాను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన 2024 కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనను తలపిస్తోందని పోలీసులు పేర్కొన్నారు.

మహిళా సిబ్బంది గదుల వద్ద కనీస భద్రత లేకపోవడమే ఈ దారుణానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. కిటికీలకు గ్రిల్స్ కూడా లేకపోవడంతో నిందితుడు సులభంగా లోపలికి వెళ్లాడని చెబుతున్నారు.

Previous సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు
Next వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం
ADVERTISEMENT