| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

MRPS జూలూరుపాడు మండల నాయకులు సాయికుమార్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ప్రధాన సెంటర్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వి హెచ్ పిఎస్ (వికలాంగుల హక్కుల పోరాట సమితి)  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వికలాంగుల సాధన సమితి నాయకుడు భూక్యా బాలు  పాల్గొని కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా మండల నాయకుడు దెబ్బెందుల సాయికుమార్ మాట్లాడుతూ

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ గారని, దివ్యాంగుల ఉద్యమాల పోరుబాట చూపిన ఘనత మందకృష్ణ మాదిగ, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

వికలాంగుల పెన్షన్లు ఏ పాలకుడి ఘనత కాదు, పోరాటం ప్రవాహంతో శాసించి సాధించుకున్నవేనని, వందల మంది వికలాంగులను వెంటబెట్టుకుని మందకృష్ణ మాదిగ ఆమరణ నిరాహార దీక్ష చేసి సాధించారని అన్నారు.

2007 లో కేవలం 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2007 నవంబర్ 26న నిజాం కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన మహాగర్జన సభలో 1500కు పెంచాలని డిమాండ్ చేసి సాధించారని గుర్తుచేశారు.

మందకృష్ణ మాదిగ VHPS ఏర్పాటు చేయకముందు ఏ ఒక్క పార్టీ పాలకుడు వికలాంగులను కనీసం గుర్తించలేదని, వికలాంగుల పోరాటం ఆత్మగౌరవ పోరాటమని, ఇది పాలకులు చూపిన సానుభూతితో వచ్చింది కాదు, శాసించి హక్కులు సాధించుకున్నారని అన్నారు.

మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వికలాంగులకు పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రిజర్వేషన్లు కల్పించే వరకు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో  కాకటి కృష్ణ ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు, చాపలమడుగు నరసింహారావు  ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు, మంద బాబు, కాకటి సుదర్శనం, వికాస్, కిన్నెర కుమార్, కిరణ్, సురేష్, చింటూ,భీమ్ సింగ్,MRPS నాయకులు, VHPS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Previous జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Next సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
ADVERTISEMENT