| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు  తెలిపిన కోడెం సీతా కుమారి

కోడెం సీతా కుమారి హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:రాఖీ పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ  పండుగ శుభాకాంక్షలు తెలిపిన యాంటీ కరప్షన్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కోడెమ్ సీతా కుమారి ఆమె మాట్లాడుతూ సోదరసోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. రాఖీ కట్టడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, జీవితాంతం ఒకరికొకరు అండగా నిలవాలనే ప్రేమ, బాధ్యతలకు ప్రతీక అని అన్నారు. కుటుంబ బంధాలు మరింత బలపడాలని, ప్రతి ఇంటా ఆనందం, ఆత్మీయత, సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమానుబంధాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు నిండాలని కోరారు. జూలూరుపాడు మండల  ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పౌర్ణమి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని  కోడెం సీతా కుమారి ఆకాంక్షించారు.


Previous ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Next దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ
ADVERTISEMENT