| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శివనగర్ కు చెందిన NCC విద్యార్థులు సోమవారం NCC శిక్షణ శిబిరానికి బయలుదేరారు.

NCCలో మొదటి సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు రెండవ సంవత్సరం శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈ క్యాంపును విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత వారు "A" సర్టిఫికెట్ పరీక్షకు అర్హత సాధించనున్నారు.

ఈ శిక్షణ శిబిరంలో విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి, సమయపాలన, నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్ మాట్లాడుతూ, NCC విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం CTO ముస్కు సంతోష్ రెడ్డి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించి, శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు.

Previous మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Next రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
ADVERTISEMENT