Posted on 2026-07-29 16:08:30
వైద్యాధికారుల జూమ్ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల పర్యవేక్షణపై జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ వైద్యాధికారులతో జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (CHCలు), ఏరియా ఆసుపత్రులు (AHలు), టీచింగ్ ఆసుపత్రులు (THలు), జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు (GGHలు), వైద్య కళాశాలలు, ప్రైవేట్ హాస్పిటళ్లు మరియు ప్రైవేట్ క్లినిక్‌లు తప్పనిసరిగా మూడు అంశాలను అమలు చేయాలని సూచించారు.
ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో కుక్క కాటు (Anti Rabies Vaccine) మందులు అందుబాటులో ఉంచాలి.
ప్రతి ఆసుపత్రిలో కుక్క కాటు కేసుల పర్యవేక్షణ కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలి.
ఈ వివరాలను ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా నోటీసు బోర్డుపై ప్రదర్శించాలి.
అదేవిధంగా, వైద్యాధికారులు తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లను రెండు వారాలకి ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేసి విద్యార్థులకు వైద్య శిబిరాలు నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేయాలని, హాస్టల్ సిబ్బందికి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. హాస్టల్లో వంట చేసే వారికి తప్పనిసరిగా జుట్టు చేతి గోర్లు కత్తిరించుకోవాలని తెలియజేశారు
గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి జ్వరం, విరేచనాలు, వాంతులు, దగ్గు, జలుబు తదితర లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వెంటనే సంబంధిత వైద్యాధికారికి సమాచారం అందించాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి చికిత్స అందించాలని సూచించారు.
ప్రతి మంగళవారం, శుక్రవారం యాక్షన్ ప్లాన్ ప్రకారం నిర్వహించే కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి వారాంత నివేదికలను సూపర్వైజర్లు, వైద్యాధికారులకు సమర్పించాలని తెలిపారు. ఆ నివేదికల ఆధారంగా వ్యాధులు అధికంగా నమోదవుతున్న గ్రామాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రోగ్రాం అధికారులు తమ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, ఎన్సీడీ స్క్రీనింగ్, శ్రమదానం, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (PMSMA), ఆరోగ్య మహిళ, సికిల్ సెల్ స్క్రీనింగ్, టీబీ అనుమానితుల గుర్తింపు, రోగులకు మందుల పంపిణీ, వైద్య శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు అందిస్తూ నిరంతర సమీక్షలు నిర్వహించాలని తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని డాక్టర్ తుకారం రాథోడ్ సూచించారు.
విధుల పట్ల నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించిన సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >