| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం

కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో, స్పర్శ స్కిన్ హాస్పిటల్ ఎదురుగా అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభమైంది.

ఈ క్లినిక్‌లో ప్రముఖ దంత వైద్య నిపుణుడు డా. ప్రణీత్ రామ్ సేవలందించనున్నారు. హైదరాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో దంత వైద్యుడిగా పనిచేసి విశేష అనుభవం పొందిన ఆయన, ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన దంత వైద్య సేవలను కామారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

క్లినిక్‌లో అత్యాధునిక ఇన్‌ట్రా ఓరల్ స్కానర్ (Intra Oral Scanner) సాంకేతికతను ఏర్పాటు చేశారు. ఈ పరికరం ద్వారా నోటి లోపలి భాగాన్ని 360 డిగ్రీల డిజిటల్ స్కానింగ్ చేసి, దంతాలు, చిగుళ్లు మరియు ఇతర నోటి సంబంధిత సమస్యలను అత్యంత ఖచ్చితంగా గుర్తించి, వాటికి తగిన చికిత్సను అందించనున్నట్లు తెలిపారు. దీంతో రోగులకు చికిత్సపై పూర్తి అవగాహనతో పాటు మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు.

ఈ క్లినిక్‌లో రూట్ కెనాల్ చికిత్స, దంతాల శుభ్రపరచడం (స్కేలింగ్), పళ్లు తొలగించడం, కృత్రిమ పళ్లు, క్యాప్స్, బ్రిడ్జ్‌లు, డెంటల్ ఇంప్లాంట్స్, కాస్మెటిక్ డెంటిస్ట్రీతో పాటు అన్ని రకాల దంత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

క్లినిక్ ప్రారంభోత్సవానికి హాజరైన పలువురు వైద్యులు డా. ప్రణీత్ రామ్ ను అభినందిస్తూ, అత్యాధునిక పరికరాలతో కామారెడ్డి ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలు అందించేందుకు ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ క్లినిక్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


Previous ఈ నెల 25 నుండి కోటప్పకొండలో తొలి ఏకాదశి మహోత్సవాలు
Next పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం
ADVERTISEMENT