| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం

పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం

డైలీ భారత్, కామారెడ్డి: పిట్లం మండల కేంద్రంలో పెద్ద కొడప్గల్ మండలానికి చెందిన శ్రీహరి ఏర్పాటు చేసిన శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూంను జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సతీమణి తోట అర్చన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ , ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించిన అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన షోరూం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.

Previous కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం
Next నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు
ADVERTISEMENT