డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ సుందరయ్యనగర్, సిక్ వాడ కు చెందిన టాక్ అమ్మన్ కౌర్-జగ్గూ సింగ్ కూతురు జమున గారి వివాహం సందర్భంగా ఈ రోజు 36 వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు 50 కిలోల బియ్యం అందించి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వధువు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,గోక లక్ష్మిరాజం, ఎర్రం రాజు,కుల్ల శ్రీనివాస్,కోడూరి మల్లేశం,కళ్లెపెల్లి రమేష్, నంగునూరి శ్రీనివాస్ మరియు వధువు బంధువులు పాల్గొన్నారు.