డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మరియు జిల్లా పంచాయతీ అధికారి విధ్యాచందన అధ్వర్యంలో శనివారం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల సాదారణ బదిలీలు ప్రశాంతంగా ముగుసినవి.
ఇట్టి బదిలీలలో మొత్త 131 మంది దరఖాస్తు చేసుకోగా ,వారిలో గ్రేడ్ -1 కార్యదర్శులు ఇద్దరు, గ్రేడ్ -2 కార్యదర్శులు నలుగురు, గ్రేడ్ -3 కార్యదర్శులు నలుగురు, గ్రేడ్-4 కార్యదర్శులు 121 మందికి మొత్తంగా 131 మంది కార్యదర్శులను వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేసినట్లు ఆమె తెలిపారు, ఇట్టి కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి సుదీర్ కుమార్, DRDA APO శ్రీనివాస రావు, APD రమణారావు, AVO సునీల్ కుమార్, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది విజయ్,విక్రమ్,ఫరూక్, దుర్గా ప్రసాద్, కార్యదర్శుల సంఘ భాద్యులు వంశీ, సతీష్ ,కిరణ్ తదితరలు పాల్గొన్నారు,