| Daily భారత్
ADVERTISEMENT
Home / News / Misc

చాయ్ వాసనలో ప్రపంచం : మంజుల పత్తిపాటి

చాయ్ వాసనలో ప్రపంచం : మంజుల పత్తిపాటి

డైలీ భారత్, స్పెషల్: 

చాయ్ వాసనలో ప్రపంచం....

విద్యార్థుల కనురెప్పల మాటున దాగిన నిద్రను దూరం చేసి...

చదువుల దారిలో వెలుగై నిలుస్తుంది టీ..!

మంచు కొండల్లో పహారా కాస్తున్న సైనికుల

గుండెల్లో వేడి నింపి నూతనత్తేజాన్ని ఇస్తుంది టీ..!

సాయంత్ర వేళలో వర్షపు తుంపరలు మేనుపై

సంగీత కచేరి చేస్తుంటే...

తుంటరి పిల్ల గాలులు మధుర జ్ఞాపకాలను తట్టి మేలుకొలుపుతుంటే...

నులివెచ్చని టీ గొంతులోకి జారుతుంటే..

అలసిన జీవితం మీద

ఆశలు తిరుగుబాటు చేసే..!

నక్షత్రాల పందిరి కింద 

ఒక చుక్క టీ పెదవిని తాకగానే...

మంజుల కవితా కలానికి మత్తెక్కి

కాలం దాచిన మగువ చెమట 

చాయ్ రంగులో కరిగిన సంధ్యలా...

ఆమె అక్షరాలు గుండెలో తిరుగుబాటు చేసే..!

మౌనం ఎప్పుడూ ఓటమి కాదని...

గాయాల గర్భంలో గుసగుసలాడే అక్షరానికి

ధైర్యం నేర్పింది టీ..!

ఒంటరి మనసుల అంచులపై

ఆత్మీయతగా ఆవిరై నిలిచి,

చీకటిలో చిగురించే చిన్న ఆశలా

ప్రతి హృదయంలో వెలుగై మిగిలిపోతుంది టీ..!

టీ ప్రియులందరికీ అంతర్జాతీయ చాయ్ (మే 21) దినోత్సవ శుభాకాంక్షలు.


రచన: పత్తిపాటి మంజుల 

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Previous లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు, రిమాండ్
Next దమ్మపేట : ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
ADVERTISEMENT