| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల కఠిన చర్యలు – ఒకరికి జైలు శిక్ష.

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల కఠిన చర్యలు – ఒకరికి జైలు శిక్ష.

డైలీ భారత్, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు నందు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 8 మంది ద్విచక్ర వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని సోమవారం 18.05.2026న సెకండ్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి శ్రీ ఆర్. శశిధర్ గారి ఎదుట హాజరుపర్చగా, అందులో 7 మందికి ఒక్కొక్కరికి రూ.1000/- జరిమానా విధించబడింది.

అలాగే ఒక ద్విచక్ర వాహనదారునికి 3 రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.


#MahabubnagarPolice

Previous రాజన్న సిరిసిల్లలో రాజకీయ సెగ...
Next శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి
ADVERTISEMENT