| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లక్షల రూపాయల కాంట్రాక్ట్ వృథా.. అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం

లక్షల రూపాయల కాంట్రాక్ట్ వృథా.. అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం

డైలీ భారత్, రామంతపూర్: రామంతపూర్ భగవత్ మూసి నాలాలో గుర్రపు డెక్క తొలగింపు పనుల కోసం లక్షల రూపాయల కాంట్రాక్ట్ మంజూరు చేసినప్పటికీ, పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితమై, గుర్రపు డెక్క తొలగింపులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు  చేస్తున్నారు.

ఈ విషయంపై సంబంధిత అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ “ఈరోజు – రేపు” అంటూ కాలయాపన చేస్తున్నారని వెంకట సాయి నగర్ కాలనీ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి విమర్శించారు. ప్రజా ధనాన్ని వృథా చేస్తున్న నిర్లక్ష్య అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, పనులను పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Previous డాన్ కావాలన్న మోజు... కన్న తల్లినే హతమార్చిన కుమారుడు
Next తగ్గిన బంగారం, వెండి ధరలు..
ADVERTISEMENT