| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

రాక్షసంగా ప్రవర్తించిన ట్యాక్సీ కారు డ్రైవర్..!

మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన..!

రంగారెడ్డిలో ఘోరమైన హిట్-అండ్-రన్!

డైలీ భారత్, హైదరాబాద్: కారుతో ఢీకొట్టడమే కాకుండా.. తనతో గొడవ పడుతున్నాడనే కోపంతో ఉన్మాదంగా ప్రవర్తించాడు కారు డ్రైవర్..! తన కారు కి అడ్డంగా నిలబడి పోనివ్వకుండా చేస్తున్నాడనే కోపంతో అలాగే అతడిని ఢీకొట్టుకుంటూ వెళ్ళాలని చూశాడు.. అయితే బాధితుడు కారు బోనెట్ పట్టుకుని అలాగే ఉండిపోయాడు. దీంతో అతన్ని అలాగే రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు.. మిగతా వాహనదారులు ఈ దుర్ఘటనను వీడియో తీయడంతో ఈ దారుణం భయటపడింది..!

మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన..! ఈ ఘటనలో తండ్రీకొడుకులను కారుతో ఢీకొట్టి వారిపై దాడి చేశారు..!

ఎస్.కె. జిలానీ, అతని కుమారుడు ఫైసల్ గాయత్రీ నగర్ నుండి ఎల్.బి. నగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా, ఒక కారు వారిని వెనుక నుండి ఢీకొట్టింది..!

ఇద్దరిమధ్య వాగ్వాదం చెలరేగి గొడవకు దారితీసింది.. దీంతో కారులో ఉన్న వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.

డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా, జిలానీ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించాడు..! కానీ దాదాపు వాహనాన్ని ఆపకుండా  దాదాపు రెండు కిలోమీటర్ల పాటు కారు బోనెట్‌పై ఉన్న అతడిని ఈడ్చుకుపోయాడు..! అతడు గాయాలతో నొప్పితో అరుస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా రాక్షసత్వం ప్రదర్శించాడు..

ఆ కారు బాలాపూర్ క్రాస్‌రోడ్స్ వరకు వేగంగా వెళ్లి, వెనక్కి తిరిగి, చివరకు మండమల్లమ్మ జంక్షన్ సమీపంలో స్థానికులు అడ్డగించడంతో పట్టుబడినట్లు సమాచారం..

ఆయితే కారు అక్కడే వదిలేసి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడనీ సమాచారం..

ఘటనలో బాధితుడు ఫైసల్‌ రెండు కాళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి.. అతను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు...

Previous అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు
Next ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి
ADVERTISEMENT