| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

డైలీ భారత్, వేములవాడ: వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడిముంజ గ్రామంలో ఇటీవల జరిగిన వాహన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, వేములవాడ ప్రాంతంలో జరుగుతున్న వాహన చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు గస్తీ మరియు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను వాహన చోరీలకు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు.

నిందితుని వివరాలు:

దామ పవన్ అలియాస్ పవన్ కళ్యాణ్, నివాసం: గోదావరిఖని.

నిందితుడి వద్ద నుండి మొత్తం 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనిని రిమాండ్‌కు తరలించింది.

ఈ కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ రామ్మోహన్, పీసీ తిరుపతి, పీసీ ఇమ్రాన్‌లను సీఐ వీర ప్రసాద్ గారు అభినందించారు.

వేములవాడ టౌన్ పోలీసులు

ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో నిల్వ ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Previous పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి
Next మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ADVERTISEMENT