| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

సిరిసిల్ల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో  మట్టి వినాయక విగ్రహాల పంపిణీ


డైలీ భారత్, సిరిసిల్ల: జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మట్టి వినాయక ప్రతిమలు ఈరోజు రమేష్ డి.ఈ.వో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డి.ఈ.వో మాట్లాడుతూ మట్టి ప్రతిమలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. పర్యావరణం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించడం అంటే మన ప్రకృతిని పూజించడంతో సమానం. మనకు జీవాన్ని, జీవితాన్ని, మనుగడని ఇస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం మనకు వినాయకచవితి ద్వారా లభిస్తోంది. అన్నారు.

ప్రధానోపాధ్యాయులు భాగ్య రేఖ  మాట్లాడుతూ అదేవిధంగా మట్టి వినాయకుడిని మాత్రమే పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది. వినాయకుడి బొమ్మని మట్టితోనే చేయాలని శాస్త్రం చెబుతోంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Previous చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో భారతదేశం త్వరలో సముద్రయాన్‌
Next అల్లంతో అందమైన చర్మం మీ సొంతం
ADVERTISEMENT