నిందుతునికి చర్లపల్లి జైలులో పిడి యాక్ట్ ఉత్తర్వులు జారీచేసిన వేములవాడ టౌన్ సి.ఐ కరుణాకర్.
డైలీ భారత్: వేములవాడ అర్బన్ మండలం శభాష్ పల్లి గ్రామానికి చెందిన అన్న బోయిన తిరుపతి యాదవ్ @ AT యాదవ్, 42 సం, అనునతని పై మర్డర్ మరియు SC/ST, ఇతర కేసులలో నేరస్థునిగా ఉన్నందున సాధారణ ప్రజల మనసుల్లో భయాందోళనను సృష్టిస్తూ శాంతిభద్రతలకు విగాధం కలిగిస్తూ ప్రజా జీవనంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తూ మరియు ప్రజల మనసుల్లో భయాందోళనలు సృష్టించి శాంతిభద్రతలకు మరియు సామాజిక శాంతికి భంగం కలిగిస్తున్నాడని,ఇట్టి వ్యక్తి పైపలు కేసులు నమోదు కావడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా నేరాలు చేస్తూ ప్రజాలను భయబ్రాంతులకు గురి చేస్తాడు అనే ఉద్దేశ్యంతో తేది 14-09-2023 రోజున ఇతని పై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పిడి యాక్ట్ అమలు చేయడానికి ఉత్తర్వులు ఇవ్వగా జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేములవాడ టౌన్ సి.ఐ కరుణాకర్ at యాదవ్ ను అదుపులోకి తీసుకొని పిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి గురువారం రోజున నిందుతున్నీ చర్లపల్లి కర్మాగారానికి తరలించి చర్లపల్లి కర్మాగారంలో వేయడం జరిగింది.
ఈ పీడీ యాక్ట్ ను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన వేములవాడ డీఎస్పీ నాగేంద్రచరి, టౌన్ సి. ఐ కరుణాకర్ లని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. అభినందించడం జరిగింది.