డైలీ భారత్, కరీంనగర్ జిల్లా: రెండు రోజుల క్రితం కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడినిఈరోజు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు డిపో-2 ఆవరణలో వేలం వేయనున్నారు.
నిబంధనల ప్రకారం లాస్ ఆఫ్ ప్రాపర్టీ కింద మరిచి పోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహించాల్సి ఉంటుందని డిపో-2 మేనేజర్ మల్లయ్య తెలిపారు.
పందెం కోడి కోసం నిన్నటి వరకు ఎవరూ రాకపోవ డంతో శుక్రవారం వేలం వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ సంఘటన నేపథ్యంలో కరీంనగర్ బస్టాండ్ లో దొరికిన పందెంకోడి నాదేనంటూ నెల్లూరు జిల్లాకు చెందిన వల్లపు మహేందర్ ఓ వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశాడు.
దయచేసి పందెంకోడి వేలం ఆపాలని ఆర్టీసీ అధికారు లను బాధితుడు వేడుకుం టున్నాడు.
దీనికి స్పందించిన ఆర్టీసీ అధికారులు పందెంకోడి వేలన్ని ఆపేదే లేదని కరీంనగర్ ఆర్టీసీ 2 డిపో మేనేజర్ చెబుతున్నారు.
అవసరమైతే కోడి బాధితుడు కూడా వేలంపాటలో పాల్గొనాలని ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు..