డైలీ భారత్, హైదరాబాద్: ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సంస్థ ముఖ్య సలహాదారులు ప్రముఖ మానవతావాది అమెరికా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా వందకు పైచిలుకు దేశాలలో అనేక సామాజిక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేస్తూ భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాల సాధన కోసం ఆయన చూపిన మార్గంలో ప్రయాణిస్తూ తను పుట్టిన మాతృభూమికి సేవ చేయాలన్న ఏకైక సంకల్పంతో ముఖ్యంగా యువతకు ఉజ్వలమైన భవిష్యత్తు అందించినప్పుడే దేశానికి సమర్థవంతమైన నాయకత్వం అందుతుందని కృషి చేస్తున్న మనవతామూర్తి.
గ్లోబల్ లీడ్ ఫౌండేషన్ స్థాపించి కరోనా కష్టకాలంలో అనాధ శవాలకు అంత్యక్రియలు చేయడం కోసం నాలుగు కొత్త అంబులెన్స్ దానం చేసి దహన సంస్కారాలకు కావలసినటువంటి అన్ని రకాల వస్తువులను అమెరికా నుంచి ఇండియాకు పంపించి ఎన్నోఅనాధ శవాలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించిన నాయకుడు డాక్టర్ హరి ఇప్పనపల్లి.
యువత పోటీ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలని అనేక విశ్వవిద్యాలయాలలో, కాలేజీలలో ఉన్న సాంకేతిక పోటీ ప్రపంచంతో యువతును చైతన్యం చేస్తూ వారికి అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ స్కిల్స్ వృత్తి నైపుణ్యాలను అందించడానికి నిష్ణాతులైన మేధావులతో కలిసి నిరంతరం ప్రోత్సహిస్తూ యువతను ముందుకు నడిపిస్తున్నారు.
భారతదేశంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సంస్థ జాతీయ అధ్యక్షులు అధ్యక్షులు డా"సీ హెచ్ భద్ర ఆహ్వానం మేరకు భారతదేశానికి వచ్చి పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరంలోని జీవోదయ ఆశ్రమంను సందర్శించడం జరిగింది. తన స్నేహితుడు గురువు అయిన హరికి భద్ర అశ్రమంలోని అనాధ బిడ్డల అవసరాల గురించి వివరించడం జరిగింది.
దానిలో భాగంగా కరోనా సమయంలో సరైన విద్య అందడంలేదని తెలిసి 36 మంది అనాధ బిడ్డలకు అత్యుత్తమ విద్యాసంస్థలలో ఉన్నతమైన ఇంగ్లీషు మీడియంతో కూడిన విద్యను అందించి పిల్లల భవిష్యత్తుకు పూల బాటలు వేయాలని నిర్ణయించుకుని హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో గల వివేకానంద హై స్కూల్లో ఉచిత విద్యతో పాటు దుస్తులు, పుస్తకాలు కావలిసిన అన్ని సౌకర్యాలు తన సొంత ఖర్చుతో అందించడం జరుగుతుంది.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రపంచ పర్యావరణ సంస్థ బృందం డాక్టర్ హరి ఇప్పనపల్లికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరి ఇప్పన్నపల్లి మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఈ బిడ్డలు నా సొంత బిడ్డలని వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రపంచ స్థాయిలో విద్య నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి నా వంతు మన సంస్థల ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని భవిష్యత్తులో మరింత మంది బిడ్డలను చదివించడానికి వారిని అంతర్జాతీయ వేదికల మీద నిలబెట్టడానికి నా జీవితాన్ని వారికి అంకితం చేస్తానని వాగ్ధానం చేశారు.
విద్యార్థులు బాగా చదువుకొని పర్యావరణ పరిరక్షణ మహా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సంస్థ ఏ కార్యక్రమం చేపట్టిన సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం, అందరికీ నాణ్యమైన విద్య అందించాలని ప్రజలకు ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో గత పది సంవత్సరాలుగా భారతదేశంలో పనిచేస్తుందని తెలియజేశారు. ఢిల్లీ నుండి గల్లీ దాకా పర్యావరణ పరిరక్షణ మహా ఉద్యమాన్ని చేపట్టి భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సులు విద్యార్థులకు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ సంస్థ బృందం హెల్త్ డైరెక్టర్ బానోతు హీరాలాల్, ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా సీఈవో చెల్లూరి శ్రీనివాస్, ఎండి పూలన్ దేవి, షిప్ ఎన్జీవో సమస్త ఫౌండర్ జి నిర్మల, గ్లోబల్ లీడ్ ఫౌండేషన్ ఇండియా ప్రెసిడెంట్ రామ్ రెడ్డి, సమస్త ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రధాన కార్యదర్శి నిఖిల్, సహాయ కార్యదర్శి ఏ రాజేష్ గౌడ్ మరియు మధుబాబు ఉపాధ్యక్షులు ప్రశాంత్ కేంద్ర ప్రభుత్వ ఆహార పంపిణీ సలహా మండలి సభ్యులు రిజ్వాన్ కళా రాజ్ మీడియా సంస్థ ఎండి మర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.