| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన సర్వేయర్

ఏసీబీకి చిక్కిన సర్వేయర్

డైలీ భారత్, హైదరాబాద్: భూ సర్వే నివేదికను మార్చి ఇచ్చేందుకు 3 లక్షల రూపాయల లంచం అడిగిన సర్వేయర్ కిరణ్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కిమ్స్ హాస్పిటల్ రోడ్డులో బాధితుడు నడుపుతున్న హోటల్ ఆక్రమించిన ప్రభుత్వ భూమిపై సర్వే జరిగినప్పుడు, నివేదికను మార్చడానికి కిరణ్ బాధితుడిని లంచం అడిగాడు. బాధితుడు ACBని ఆశ్రయించడంతో, ఈరోజు లక్ష రూపాయలు తీసుకునేందుకు సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన కిరణ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ స్థలంలో 999 నంబర్ గల ఇన్నోవా కారులో డబ్బును ఉంచమని సూచించినట్లు సమాచారం.

Previous మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ
Next డ్రగ్స్ మూలాలు పెకిలించివేయాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
ADVERTISEMENT