| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం

డైలీ భారత్, హైదరాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరచూ బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. బాంబు ఉన్నట్లు మెయిల్ రావడంతో విమానాశ్రయ సిబ్బంది అలర్ట్ అయి తనిఖీలు చేయడం.. ఆ తరువాత అవి ఫేక్ అని తేలడం జరుగుతూనే ఉంది. అయితే ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు వార్తలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పడు తాజాగా మరోసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఈరోజు (మంగళవారం) ఉదయం 10:05 గంటలకు ఎయిర్‌పోర్టులో బాంబు ఉన్నట్లుగా మెయిల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్‌లో బ్లాస్ట్ జరుగుతుందని ప్రయాణికులను వెంటనే ఖాళీ చేయాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్‌లో హెచ్చరించారు. కసబ్‌ను మైనర్‌గా విచారణ చేయకుండానే ఉరి తీశారని మెయిల్‌లో రాశారు. ఈరోజు ఆపరేషన్ కోసం లాజిస్టిక్స్ సిద్ధం చేయడానికి 3 నెలలు పట్టిందని మెయిల్ సారాంశం.

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లో ఉన్న ముస్లింలు, మహిళలు, పిల్లలను ఖాళీ చేయాలని కోరుతూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపారు. దీంతో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్‌పోర్టులో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మెయిల్ ఎవరు పంపారు?.. ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై కూడా విమానాశ్రయ సిబ్బంది ఆరా తీసే పనిలో ఉన్నారు.

Previous సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఉద్యోగులకు గౌరవ భృతి చెల్లింపు కొరకు TSUTF రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రాతినిథ్యం
Next మేరా యువ బారత్ ఆధ్వర్యంలో సర్దార్ @150 యూనిటీ మార్చ్
ADVERTISEMENT